బిగ్ బాస్ – కింగ్ నాగ్ ను రిప్లేస్ చేసే కొత్త హోస్ట్ ఎవరో తెలుసా..?

Published on Oct 22, 2020 5:20 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ను మన టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు ఎంత అద్భుతంగా హోస్ట్ చేసారో మనం చూసాము. అలా ఒక్కొక్కరు సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకున్న ఈ ఎంటర్టైనింగ్ షో ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా అంతే జోరుతో దూసుకుపోతుంది. గత మూడవ సీజన్ కు హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జునే మళ్ళీ హోస్ట్ చేసి అద్భుతంగా రాణిస్తున్నారు.

స్మాల్ స్క్రీన్ పై నాగార్జున హోస్టింగ్ కు ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. అందుకే నాగ్ చేసే ఎపిసోడ్స్ కు భారీ స్థాయి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఈవారం మాత్రం నాగ్ మిస్సవ్వనున్నారు. తన సినిమాల కారణంగా వేరే రాష్ట్రాల్లో షూట్ ఉండేసరికి చిన్న విరామం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే రెండు షూటింగులను బ్యాలెన్స్ చేయలేకపోవడం మూలాన ఈ వారాంతానికి మాత్రం కొత్త హోస్ట్ నే చూడడం ఫిక్స్ అయ్యిపోయింది.

మరి కింగ్ నాగ్ ను ఎవరు రీప్లేస్ చేస్తారా అన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఈసారి నాగ్ ను రీప్లేస్ చేయబోయేది మరెవరో కాదు స్వయానా నాగ్ కోడలు మరియు స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతానే అట. ఆమెనే నాగ్ ను ఈ వారం రీప్లేస్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్టు ఇప్పుడు సమాచారం. మరి ఈ గ్రాండ్ ఎపిసోడ్ లో సమంతా ఎంట్రీ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :