పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే అనౌన్స్ చేసిన మరో భారీ ప్రాజెక్ట్ “సలార్”. కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సాలిడ్ చిత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. మరి అదే క్రమంలో కొంత కాలం నిరీక్షణ అనంతరం ఈ సెన్సేషనల్ కాంబో నుంచి అనౌన్స్మెంట్ సహా పోస్టర్ కూడా రావడంతో మళ్ళీ అన్ని సినీ వర్గాలలో హీట్ మొదలయ్యింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు గాను ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్యాస్టింగ్ మరియు టెక్నికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని సాలిడ్ విలన్ రోల్ కు గాను మళ్ళీ బాలీవుడ్ నుంచే ఓ స్టేర్ నటుడునే తీసుకుంటున్నారని బజ్ వినిపిస్తుంది. ఇప్పటికే కేజీయఫ్ లోని అధీరాగా సంజయ్ దత్ ను తీసుకున్నారు. మరి ఇప్పుడు అలానే ఓ సీనియర్ స్టార్ నటుడినే సలార్ లో ప్రభాస్ కు ఆపోజిట్ గా తీసుకోనున్నారట. మరి నీల్ ఎంచుకున్న ఆ స్టార్ నటుడు ఎవరో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.
