ఈరోజే మన సౌత్ ఇండియన్ సినిమాకి చెందిన పలువురు స్టార్స్ బర్త్ డే కూడా కావడం విశేషం దీనితో ఈరోజు ఉదయం నుంచే వారి సినిమాల నుంచి కొత్త అనౌన్సమెంట్స్ రావడం మొదలు పెట్టాయి. మరి ఈ నటులలో కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్ కూడా ఒకరు. మరి విశాల్ నయా ప్రాజెక్ట్ ఈరోజు అనౌన్స్ కాగా విశాల్ తన పుట్టినరోజు వేడుకలను చెన్నై లోనే జరుపుకున్నారు.
అయితే విశాల్ అందరికీ భిన్నంగా తన కుటుంబ సభ్యులతోనో లేక స్నేహితులతోనో కాకుండా కొంతమంది వృద్ధులు, చిన్నారుల సమక్షంలో చాలా సింపుల్ గా అందంగా తన బర్త్ డే ని జరుపుకున్నారు. వారికి అన్నం పెట్టి వారితో కలిసి కూర్చొని తిని కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. దీనితో ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్స్ విశాల్ సింప్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారు. అయితే ఇది వరకే విశాల్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.
