“కంగువ” లో కొన్ని సీన్స్ చూసి థ్రిల్ అయ్యిన సౌత్ స్టార్ హీరో..

“కంగువ” లో కొన్ని సీన్స్ చూసి థ్రిల్ అయ్యిన సౌత్ స్టార్ హీరో..

Published on May 26, 2024 1:00 AM IST

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న ఒక ఊహించని భారీ చిత్రమే “కంగువ”. మరి టైం ట్రావెల్ నేపథ్యంలో పీరియాడిక్ సహా ప్రస్తుత కాలం సంబంధించి చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని ప్రముఖ స్టార్ హీరో చూసినట్టుగా తెలుస్తుంది.

మరి తాను ఎవరో కాదు తమిళ్ లో భారీ క్రేజ్ ఉన్నటువంటి థలా అజిత్ కుమార్ అట. అజిత్ అలాగే కంగువ దర్శకుడు శివ కాంబినేషన్ లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఈ సాన్నిహిత్యంతో కంగువ లోని కొన్ని సీన్స్ ని అజిత్ చూసి థ్రిల్ అయ్యారట. అలా దర్శకుడు శివని అభినందించారని తమిళ్ సినీ ప్రముఖులు రెవెల్క్ చేశారు.

దీనితో ఇప్పుడు ఈ న్యూస్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక అజిత్ ఇప్పుడు మన తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో తన ఫ్యాన్ డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ తో “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు