పవన్ – క్రిష్ సినిమాలో స్టార్ హీరోయిన్ ఫిక్స్ !

పవన్ – క్రిష్ సినిమాలో స్టార్ హీరోయిన్ ఫిక్స్ !

Published on Feb 26, 2020 2:28 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలోనూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ లలో పవన్ పాల్గొంటున్నాడు. అయితే క్రిష్ – పవన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దాని పై చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి నేటితో హీరోయిన్ ఫైనల్ అయింది. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అజ్ఞాతవాసిలో ఆమె పవన్ సరసన నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు