నాని ఇంట్రెస్టింగ్ సినిమాలోకి ఈ టాలెంటెడ్ నటుడు.!

Published on Mar 3, 2021 1:08 am IST


ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా పలు ఆసక్తికర సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఆల్రెడీ తన హిట్ దర్శకుడు శివ నిర్వాణతో తెరక్కించిన “టక్ జగదీష్” కాగా మరొకటి లేటెస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న “శ్యామ్ సింగ రాయ్”.

ఇటీవల ఈ చిత్రం నుంచి నాని లుక్ ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యగా దానిని ట్రెమండ్యస్ రెస్పాన్స్ వచ్చింది. అదంతా చూస్తుంటే ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుండగా ఈ సినిమాలోకి మరో టాలెంటెడ్ నటుడు వచ్చినట్టుగా తెలిపారు. అతడే జిష్షు సేన్ గుప్తా. తెలుగులో తాను చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ మరియు ఇంప్రెస్ ను తెచ్చుకోగలిగాడు.

మరి ఈ నటుడు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :