రామ్ చరణ్ రేస్ లో ఆ టాలెంటెడ్ దర్శకుడు కూడా?

Published on May 30, 2020 2:07 am IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లూరిగా చరణ్ ఎలా కనిపిస్తారో అని మెగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

అలాగే మరోపక్క దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” లో కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నట్టుగా కూడా ఖరారు అయ్యింది. అయితే ఈ రెండు భారీ ప్రాజెక్టుల అనంతరం చెయ్యబోయే ప్రాజెక్టుకు గాను చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఓ టాలెంటెడ్ దర్శకుని పేరు కూడా వినిపిస్తుంది. అతను మరెవరో కాదు. “మళ్ళీరావా”, “జెర్సీ” లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను టాలీవుడ్ ఆడియన్స్ కు అందించిన గౌతమ్ తిన్ననూరి. మరి చరణ్ తర్వాత ఏ దర్శకునికి అవకాశం ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More