ఈసారి బిగ్ బాస్ షార్ట్ అండ్ స్వీట్ గా..!

ఈసారి బిగ్ బాస్ షార్ట్ అండ్ స్వీట్ గా..!

Published on Jul 21, 2020 8:06 AM IST

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణతో దూసుకు పోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్స్ సూపర్ సక్సెస్ కావడంతో మరింత క్రేజీగా బిగ్ బాస్ సీజన్ 4 నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా షో నిర్వహణ కష్టం అని కొందరు భావిస్తున్నారు. ఐతే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ షో ఉంటుంది అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికే సెలెబ్రిటీల వేటలో స్టార్ మా యాజమాన్యం ఉన్నారు. కొందరు బుల్లి తెర నటులతో పాటు వెండి తెర నటులను, ప్రముఖులను సంప్రదిస్తున్నారు. కాగా ఈ సారి షో పీరియడ్ తగ్గించ నున్నారట. 100 రోజుల నిడివి గల ఈ షో ని 70రోజులకు తగ్గించనున్నారని సమాచారం. ఎపిసోడ్స్ తక్కువైనా మసాలా కాన్సెప్ట్స్, గేమ్స్ తో మరింత ఎంటర్టైనింగ్ గా షో ప్లాన్ చేస్తున్నారట.

తాజా వార్తలు