ప్రస్తుతం తమిళ హీరోస్ తో బిజీగా ఉన్న తెలుగు దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శకుడు వెంకీ అట్లూరి అనే చెప్పాలి. వెంకీ నుంచి వచ్చిన వరుస సినిమాలు ఒకొకటిగా సూపర్ హిట్స్ అవుతూ వచ్చాయి. ధనుష్ తో సార్, దుల్కర్ తో లక్కీ భాస్కర్ ఇప్పుడు సూర్యతో విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో తాను రాబోతున్నారు.
ఇక సూర్యతో సినిమా విషయంలో కూడా మేకర్స్ చాలా నమ్మకంగా ఉండగా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా విషయంలో వెంకీ ఇచ్చిన క్లారిటీ ఆసక్తిగా మారింది. తన నెక్స్ట్ హీరో కూడా తమిళ్ హీరోనే అని కన్ఫర్మ్ చేశారు. తన మొదటి తమిళ్ హీరో ధనుష్ తోనే ఓ సాలిడ్ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే గత సినిమాలో సాఫ్ట్ గా ఒక టీచర్ రోల్ ఇస్తే ఈసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ధనుష్ ని తాను ప్రెజంట్ చేయనున్నట్టు తెలిపారు. సో ఈ క్రేజీ కలయిక ఎప్పుడు నుంచి మొదలు అవుతుంది అనేది వేచి చూడాలి.


