
ఎన్నో ఆశలతో హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నాకు రెండు సార్లు చేదు అనుభవం ఎదురైంది. ‘హిమ్మత్ వాలా’, ‘హమ్ షకల్స్’ చిత్రాలు ఘోర పరాజయం పాలవడంతో హిందీలో తమన్నా కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనని విశ్లేషకులు భావించారు. తెలుగులో ‘ఆగడు’, ‘బాహుబలి’ చిత్రాలతో బిజీ కావడంతో హిందీ సినిమాలను వదిలేసినట్టే అనుకున్నారు.
తమన్నా మాత్రం హిందీలో హిట్ కొట్టాలనే కసితో ఉంది. తన కలను సాకారం చేసుకోవడం కోసం… లేటెస్ట్ హిందీ సినిమా ‘ఎంటర్టైన్మెంట్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ తనవంతు ప్రయత్నం చేస్తుంది. హీరో అక్షయ్ కుమార్ తో కలసి సినిమాను ప్రమోట్ చేస్తూ… తనను కూడా బాగా ఫోకస్ చేసుకుంటుంది. ఈసారైనా ప్రేక్షకులు తమన్నాకు విజయాన్ని అందిస్తారో..? లేదో..?