ఈసారి హర్రర్ మిస్టరీ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్న టాలీవుడ్ యంగ్ హీరో

ఈసారి హర్రర్ మిస్టరీ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్న టాలీవుడ్ యంగ్ హీరో

Published on Apr 18, 2024 1:59 AM IST

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు మూవీ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక నేడు శ్రీరామ నవమి సందర్భంగా తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు శ్రీనివాస్. తన కెరీర్ 11వ మూవీగా రూపొందనున్న దీనిని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తుండగా ఇటీవల బాలయ్యతో భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ అందుకున్న షైన్ స్క్రీన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించనున్న ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ పోస్టర్ నేడు రిలీజ్ చేసారు. హర్రర్ మిస్టరీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిన్మయి సలస్కర్ కెమెరా వర్క్ అందించనున్న ఈ మూవీకి మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు