
ఈ మధ్య డేవిడ్ వార్నర్ అల వైకుంఠపురంలో సాంగ్స్ పై టిక్ టాక్ వీడియోలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. ఓ ఇంటర్నేషన్ క్రికెటర్ మరియు స్టార్ బ్యాట్స్ మెన్ ఇలా తమ సినిమాలోని పాటలకు స్టెప్స్ వేయడం హీరో అల్లు అర్జున్ కి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి మంచి అనుభూతిని పంచుతుంది. సోషల్ మీడియా వేదికగా బన్నీ డేవిడ్ వార్నర్ కి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. మొదట ఆయన బుట్ట బొమ్మ సాంగ్ కి తన వైఫ్ కాండీస్ వార్నర్ తో కలిసి స్టెప్స్ వేయడం జరిగింది. ఆ తరువాత అల వైకుంఠపురంలో నుండి రాములో రాములా సాంగ్ కి డాన్స్ వేసి మెప్పించారు.
కాగా తాజా వీడియోలో వార్నర్ రాములో రాములా సాంగ్ కొత్తగా ట్రై చేశాడు. డాన్స్ కి బదులు సోలోగా స్టైలిష్ గా ఫినిష్ చేశాడు. డేవిడ్ వార్నర్ వీడియోలకు మంచి స్పందన రావడంతో ఆయన వరుస వీడియోలు చేస్తున్నారు. ఇక అల వైకుంఠపురంలో సాంగ్స్ మేనియా సినిమా విడుదలై ఇన్నాళ్ళు అవుతున్నా వదలడం లేదు. అనేక మంది బాలీవుడ్ సెలెబ్రటీలు కూడా ఈ సాంగ్స్ కి స్టెప్స్ వేయగా రెండు రోజుల క్రితం సిమ్రన్ బన్నీ సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించింది.
https://www.instagram.com/p/CAMK0gcp5VT/?igshid=16c464zhouf2b

