ఈసారి “ఆదిపురుష్” నుంచి వచ్చే అప్డేట్ ఇదేనా?

ఈసారి “ఆదిపురుష్” నుంచి వచ్చే అప్డేట్ ఇదేనా?

Published on Oct 1, 2020 11:00 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీటితో పాటుగా మరో భారీ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేసే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇపుడు నటిస్తున్న ఈ మూడు చిత్రాల్లో మంచి అంచనాలు ఉన్న వాటిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్”.

రామాయణ ఇతిహాస గాథపై తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ రోల్ తో పాటు మరో కీలక రోల్ అయినటువంటి రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ చేస్తున్నట్టుగా కొద్ది రోజుల వ్యవధిలోనే చెప్పేసారు. అయితే అక్కడ నుంచి ఇతర క్యాస్టింగ్ కు సంబంధించి ఏ వివరాలు బయట పెట్టలేదు. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం నెక్స్ట్ హీరోయిన్ పేరునే అనౌన్స్ చేసే సూచనలు ఉన్నాయని బజ్ వినిపిస్తుంది. మరి అది ప్రభాస్ పుట్టినరోజుకేనా లేక మరే ఇతర రోజున ప్లాన్ చేసారా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు