“విశ్వంభర” లో మెయిన్ విలన్ గా వెర్సటైల్ నటుడు

“విశ్వంభర” లో మెయిన్ విలన్ గా వెర్సటైల్ నటుడు

Published on Mar 5, 2024 7:57 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్స్ ఫాంటసీ చిత్రం “విశ్వంభర”. మరి మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఈ ఒక్క సినిమా కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

అయితే ఈ చిత్రం పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలకి చాలా మంది స్టార్ నటులే కనిపిస్తున్నారు. తెలుగు సహా హిందీ నుంచి కూడా ఇందుకు తెచ్చుకుంటుండగా ఇంట్రెస్టింగ్ గా విశ్వంభర లో మెయిన్ విలన్ గా వెర్సటైల్ నటుడు రావు రమేష్ కనిపించనున్నారని సమాచారం.

దీనితో ఇప్పుడు పరిస్థితులు మరింత ఆసక్తిగా మారాయి. మరి ఈ భారీ చిత్రంలో రావు రమేష్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు