ఇంట్రెస్టింగ్..ఓటిటిలో “లియో” డబ్ వెర్షన్ డామినేషన్.!

ఇంట్రెస్టింగ్..ఓటిటిలో “లియో” డబ్ వెర్షన్ డామినేషన్.!

Published on Nov 28, 2023 4:08 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా ప్రస్తుతం కోలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “లియో”. భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ సెన్సేషనల్ వసూళ్లతో అదరగొట్టింది. మరి ఈ చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ కి కూడా వచ్చేసింది.

మరి ఇండియాలో ఈ సినిమా కూడా వచ్చిన స్టార్టింగ్ లో భారీ రెస్పాన్స్ అందుకోగా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయినటువంటి తమిళ్ వెర్షన్ ఇండియాలో నెంబర్ 1 లో ట్రెండ్ అవ్వట్లేదు. తమిళ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రెండో ప్లేస్ లో ట్రెండ్ అవుతుండగా హిందీ వెర్షన్ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.

బాక్సాఫీస్ పరంగా కానీ క్రేజ్ పరంగా కానీ తమిళ్ లోనే విజయ్ కి మంచి పట్టు ఉంది అలాంటిది దానిని కూడా హిందీ వెర్షన్ డామినేట్ చేయడం విశేషం. ఇక తెలుగు వెర్షన్ అయితే టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు