పవన్, ప్రభాస్ లలో అదే కామన్ పాయింట్ – సుజీత్ కామెంట్స్

పవన్, ప్రభాస్ లలో అదే కామన్ పాయింట్ – సుజీత్ కామెంట్స్

Published on May 27, 2024 11:34 AM IST

మన టాలీవుడ్ లో విశేషమైన ఆదరణ ఉన్నటువంటి దిగ్గజ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరితో కలిపి వర్క్ చేసిన దర్శకులు అయితే చాలా తక్కువే ఉన్నారని చెప్పాలి. మరి వీరిలో మన టాలీవుడ్ దర్శకుడు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ ఒకడు.

అయితే సుజీత్ నుంచి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో “ఓజి” (They Call Him OG) పై చాలానే విశేషాలు వచ్చాయి. అయితే ఈ సమయంలో తాను తన హీరోస్ పవన్, ప్రభాస్ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తాను ఇద్దరితో వర్క్ చేసిన సమయంలో గమనించిన అంశం కోసం చెప్పాడు.

తాను ఇద్దరిలో కామన్ గా ఒక జెన్యూనిటీ పాయింట్ ని గమనించానని, వారు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇతరుల విషయంలో ఎప్పుడూ మాట్లాడరని ఒకరి మీద కంప్లైంట్ చెయ్యడం లాంటివి తానెప్పుడూ చూడలేదని, ఈ పాయింట్ పవన్, ప్రభాస్ గార్లలో కామన్ గా అనిపించింది అని సుజీత్ తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు