“కల్కి 2898 ఎడి” లో కమల్ పాత్రకి ప్రేరణ ఇదేనా?

“కల్కి 2898 ఎడి” లో కమల్ పాత్రకి ప్రేరణ ఇదేనా?

Published on Apr 30, 2024 6:22 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇదొక యూనిక్ సై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తుండగా మహాభారతం లోని పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. అలా రీసెంట్ గానే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) అశ్వథామ పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు.

ఇక ప్రభాస్ పాత్ర కూడా విష్ణు అవతారం అన్నట్టుగా కూడా బజ్ ఉంది. మరి ఈ భారీ క్యాస్టింగ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పాత్ర కోసం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. కమల్ ఈ సినిమాలో ఎలాగో విలన్ పాత్ర చేస్తున్నారని తెలిసిందే. అయితే కమల్ పాత్ర ఒక మోడ్రన్ కంసుని తరహాలో ఉంటుంది అని తెలుస్తుంది. కంసుని పాత్ర నుంచి ప్రేరణ చెందినట్టుగా ఉంటుంది అని టాక్.

మరి చూడాలి తన పాత్ర అలానే ఉంటుందా లేక వేరే విధంగా ఉంటుందా అనేది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ జూన్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు