మెయిన్ గా “ఎన్టీఆర్ 30″కు దీనిపైనే సస్పెన్స్.!

Published on Apr 12, 2021 7:06 am IST

మన టాలీవుడ్ లో మాంచి మాస్ క్రౌడ్ పుల్లింగ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఇప్పుడు తారక్ రాజమౌళితో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇది లైన్ లో ఉండగానే ఎప్పుడో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్ అయ్యిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయే సరికి అసలు తారక్ 30వ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు అన్నది హాట్ టాపిక్ అవుతుంది.

గత రెండు రోజుల నుంచి అయితే ఓ రేంజ్ లో ఇదే హాట్ టాపిక్. మరి దీనికి తెర దించేందుకు ఈరోజు ముహూర్తం కుదరగా అసలు ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఎలాగో త్రివిక్రమ్ పేరు కన్ఫర్మ్ అయినా మళ్ళీ ఎందుకో అది మారుతుందా అన్న అనుమానాలు చాలానే స్టార్ట్ అయ్యాయి. దీనితో తారక్ 30 వ చిత్రం దర్శకుడు ఎవరు అన్నది మంచి సస్పెన్స్ గా మారింది. మరి ఆ మిస్టరీ వీడాలంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :