బిగ్ బాస్ 4 – మేకర్స్ కు టఫ్ గా మారిన ఈ ఎలిమినేషన్..?

బిగ్ బాస్ 4 – మేకర్స్ కు టఫ్ గా మారిన ఈ ఎలిమినేషన్..?

Published on Dec 5, 2020 6:31 PM IST

ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాలుగో సీజన్ కూడా ముగుస్తుండడంతో టైటిల్ రేస్ లో ఎవరు ముందున్నారు అన్నది హాట్ టాపిక్ గా బిగ్ బాస్ వీక్షకుల్లో నడుస్తుంది. అయితే దీనికి ముందు మరో ఆసక్తికర అంశం అంతకు మించి అనేలా వస్తుంది. ఇప్పటికే 12 వారాలు ముగిసి 13వ వారంలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఇంకో వారం అయిపోతే ఫైనల్స్ వచ్చేస్తుంది. మరి ఫైనల్స్ కి కావాల్సింది కేవలం ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఏడుగురు ఉన్నారు.

దీనితో ఈసారి ఎలిమినేషన్ మేకర్స్ కు మరింత టఫ్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే డేంజర్ జోన్ లో అవినాష్, మోనాల్ అలాగే హారికలు ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పైగా తక్కువ సమయం మిగిలి ఉండటం అలాగే గత వారపు ఎలిమినేషన్ ను స్కిప్ చెయ్యడం వంటివి ఈ వారం ఎపిసోడ్ పై ప్రెజర్ పడ్డట్టు అయ్యింది దీనితో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది మేకర్స్ కు ఊహించనిదిగా మారింది.

మరి ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరిని చేస్తారు అని, మేకర్స్ మొదటి నుంచీ మోనాల్ ను సేవ్ చేస్తున్నారు. మరి ఒకవేళ మోనాల్ ను దాటించాలి అంటే ఆమె కన్నా అలాగే అవినాష్ కన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి హారికను చెయ్యాలి. ఇది కనుక చేస్తే ఫాలోవర్స్ నుంచి ఎదురుదాడి తప్పదు. దీనితో ఈవారం ఎలిమినేషన్ మాత్రం కాస్త ఛాలెంజింగ్ గానే ఉండనుంది అని చెప్పాలి. మరి ఈసారి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు