
మాస్ మహారాజ రవితేజ, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ‘కిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులకు వినోదపు కిక్ ఎక్కించింది. ఈ సినిమాలో రవితేజ చేసిన హంగామా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి.
ఈ వారమే ‘కిక్ 2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభిస్తారు. రవితేజ షూటింగ్ లో పాల్గొంటారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ‘కిక్’ తరహాలో ఈ సీక్వెల్ కూడా అభిమానులకు వినోదం అందిస్తుందని దర్శకనిర్మాతలు చెప్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశి కథను అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.