“కన్నప్ప” లో ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే!?

“కన్నప్ప” లో ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే!?

Published on Mar 31, 2024 12:19 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటితో పాటుగా ప్రభాస్ మరో చిత్రంలో ఓ సాలిడ్ క్యామియో రోల్ కూడా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. మంచు వారి హీరో మంచు విష్ణు తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సినిమా అలాగే తన డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి “కన్నప్ప” (Kannappa Movie) లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నట్టుగా తెలిసిందే.

అయితే మరి ప్రభాస్ సెట్స్ లో ఎప్పుడు జాయిన్ కానున్నాడు అనే అంశం పై లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం తాను ఈ ఏప్రిల్ 12 నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఇండియా వైడ్ గా కూడా అనేకమంది భారీ తారాగణం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అలాగే మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు