‘రామాయణ’ పార్ట్ 1 మొదట విడుదలయ్యేది ఈ దేశంలోనే! ఎక్కడంటే..

ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ సినిమా ‘రామాయణ’. పూర్తిగా ఐమాక్స్ వెర్షన్ లో తెరకెక్కించి విడుదలకి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల రాబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 6న ఇండియాలో మాత్రం నవంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఈ రెండు డేట్స్ కూడా కాకుండా ఓ దేశంలో మాత్రం ఇంకో రోజు ముందే విడుదల అయ్యేందుకు ఈ సినిమా సిద్ధం అయ్యింది. రామాయణ పార్ట్ 1 ని మేకర్స్ ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ముందు ప్రస్తుతం సింగపూర్ లో నవంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ఖరారు చేసారు. సో ప్రస్తుతానికి ఇదే ఎర్లీ రిలీజ్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రణబీర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, కాజల్ తదితరులు కీలక పాత్రలు చేయగా నితీష్ తివారి దర్శకత్వం వహించారు.

Exit mobile version