“ఓజి” ర్యాంపేజ్ కి దగ్గర పడుతున్న సమయం

“ఓజి” ర్యాంపేజ్ కి దగ్గర పడుతున్న సమయం

Published on May 24, 2024 1:01 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ యాక్షన్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు క్రేజీ లెవెల్లో ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూట్ అయితే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కానుంది? మళ్ళీ సూపర్ యాక్టివ్ గా డీవీవీ వారు సినిమాపై ఎప్పుడు అప్డేట్స్ అందిస్తారు అని ఎదురు చూస్తున్నారు.

అయితే మరోసారి “ఓజి” ర్యాంపేజ్ కి సమయం ఎంతో దూరంలో లేదని చెప్పాలి. గతంలోనే మేకర్స్ అన్ని అప్డేట్స్ ఇక మే నెల తర్వాత నుంచే వస్తాయని కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఇప్పుడు అందుకు ఎంతో సమయం లేదనే చెప్పాలి. సో జూన్ నుంచే మళ్ళీ ఓజి ర్యాంపేజ్ మొదలు కానుంది అని చెప్పాలి. మరి ఈ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మరోపక్క ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై కూడా ఆసక్తి నెలకొంది. అలాగే అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు