తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?

తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?

Published on Aug 23, 2026 9:00 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ నటుడు యష్ హీరోగా కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్ అలాగే తారా సుతారియా లాంటి స్టార్ హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో తను చేసిన లేటెస్ట్ సినిమానే “టాక్సిక్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఆల్రెడీ రికార్డ్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.

కన్నడ, హిందీ భాషల్లో వదిలిన బుకింగ్స్ మాస్ రెస్పాన్స్ రాగా ఇక తెలుగు వెర్షన్ బుకింగ్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. అలాగే నిన్న తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.

మేకర్స్ ఈ ఆగస్ట్ 24న టాక్సిక్ ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ని తెరవనున్నారు. సో టాక్సిక్ కి ఎలాంటి రెస్పాన్స్ మన ఆడియెన్స్ నుంచి వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందించారు. అలాగే యష్, కే వెంకట రమణ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు