గోపీచంద్ సినిమా అందుకే పోస్ట్ పోన్..!

Published on Mar 28, 2021 2:00 pm IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “సీటీమార్”. ఎప్పటి నుంచో లైన్ లో ఉన్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 2న విడుదలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా లాస్ట్ మినిట్ లో ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యిందని వార్త బయటకు వచ్చింది.

కానీ అందుకు గల కారణం ఏమిటి అన్నది తెలియరాలేదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా ఎందుకు ఆగాల్సి వచ్చిందో కారణం తెలుస్తుంది. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలకు గాను కొంత గ్రాఫికల్ వర్క్ ఉందట. అది సకాలంలో పూర్తి కాకపోవడమే అనుకున్న టైం కి సినిమా రాకపోవడానికి కారణం అన్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రానికి కొత్త డేట్ కోసం మేకర్స్ చూస్తున్నారు. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :