థియేటర్స్ లో “సలార్” ట్రైలర్ అందుకే రాలేదా?

థియేటర్స్ లో “సలార్” ట్రైలర్ అందుకే రాలేదా?

Published on Dec 9, 2023 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే “సలార్”. మరి కేజీయఫ్ యూనివర్స్ కి సంబంధం లేకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించారు. అయితే కొన్ని రోజులు కితమే సినిమా ట్రైలర్ రాగా దీనికి అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

కానీ చాలా మంది ఈ ట్రైలర్ ని థియేటర్స్ లో కూడా చూద్దాం అనుకున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా ఏ సినిమా ముందు కానీ ఇంటర్వెల్ లో కానీ సలార్ ట్రైలర్ ప్లే కాలేదు. అయితే దీనికి కారణం ట్రైలర్ సెన్సార్ కంప్లీట్ కాకపోవడమే అని తెలుస్తోంది.

అందుకే ఇప్పటి వరకు ట్రైలర్ థియేట్రికల్ గా కనిపించలేదట. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ ట్రైలర్ సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనితో ఇక నుంచి థియేటర్లు లో కూడా సలార్ ట్రైలర్ ప్రసారం మొదలు కానుంది అని తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో సలార్ రెండో ట్రైలర్ కూడా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ బిగ్ డే కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు