ప్రభాస్ కు సోదరుడు దొరికేసాడా.?

Published on Nov 27, 2020 8:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తీస్తున్న మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో అలాగే మన దేశంలోనే ఏ సినిమాకు పెట్టని విధమైన భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లు చేస్తున్నారని మెయిన్ లీడ్ ను మేకర్స్ త్వరగానే రివీల్ చేసేసారు. ఇంకా అలాగే మిగతా క్యాస్టింగ్ విషయంలో మాత్రం ఇంకా గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. అలా గత కొన్ని రోజుల నుంచి ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఆ టాక్ ప్రకారం ఈ చిత్రంలో ఆ రోల్ ను బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపిస్తుంది. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడి పేరే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More