టాక్..”బాలయ్య 109″ నుంచి యంగ్ హీరో అవుట్?

టాక్..”బాలయ్య 109″ నుంచి యంగ్ హీరో అవుట్?

Published on Mar 5, 2024 9:00 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తో భారీ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది బాలయ్య కెరీర్ లో 109 సినిమాగా అందులోని మొత్తం మూడు భారీ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో సాలిడ్ హైప్ అందుకుంది. అయితే అప్డేట్స్ విషయంలో కొంచెం వెనుకబడ్డ ఈ చిత్రం నుంచి టైం టు టైం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి ఈ గ్యాప్ లో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్టుగా టాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దుల్కర్ అయితే ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు