అఫీషియల్ : శివరాజ్ కుమార్ తో యంగ్ హీరోయిన్ కన్నడ ఎంట్రీ

కన్నడ సినిమా దగ్గర అపారమైన క్రేజ్ ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోస్ లో నమ్మ శివరాజ్ కుమార్ కూడా ఒకరు. మరి శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన “జైలర్” తో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ తాను అందుకోగా ఇప్పుడు కన్నడలో రోహిత్ పడకి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సాలిడ్ చిత్రమే “ఉత్తరకాండ”.

మరి ఈ సినిమాతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కన్నడ సినిమాలో అడుగు పెట్టబోతోంది. తాను స్వయంగా లేటెస్ట్ గా అఫీషియల్ రివీల్ చేసింది. ఇప్పుడు వరకు తెలుగు సహా తమిళ్ లో పలు చిత్రాల్లో కనిపించి మంచి పాత్రల్లో మెప్పించిన ఈమె ఈ సినిమాలో ఆమె దుర్గ అనే పాత్రలో కనిపిస్తునట్టుగా తెలిపింది.

ఇక రెగ్యులర్ షూట్ లో ఆమె త్వరలోనే జాయిన్ కానుండగా ఈ చిత్రంలో వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) విలన్ ధనంజయ, సప్త సాగరాలు దాటి సైడ్ బి ఫేమ్ చైత్ర జే ఆచార్ కూడా నటించడం విశేషం. మొత్తానికి అయితే ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో ఐశ్వర్య కన్నడ సినిమాలోకి వెళుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది.

Exit mobile version