తారక్ ఈ ప్రాజెక్ట్ పై అవన్నీ సుత్తి రూమర్స్.!?

Published on Apr 6, 2021 10:07 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సెన్సేషనల్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం కూడా తారక్ నుంచి సాలిడ్ లైనప్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇదిలా ఉండగా అనతి కాలంలోనే మంచి బంధం ఏర్పర్చుకున్న తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే లోపు ‘RRR’ లో తారక్ ఆల్ మోస్ట్ తన రోల్ కంప్లీట్ అవ్వనుండగా ఈ సినిమాకు సరికొత్త మేకోవర్ లో స్టార్ట్ అయ్యేలా ప్లాన్ జరిగింది. ఇప్పటికే త్రివిక్రమ్ సాలిడ్ స్క్రిప్ట్ సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసేసారు. మరి ఈ సమయంలో ప్రాజెక్ట్ పై ఉందా లేదా అని కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి.

కానీ మేకర్స్ మాత్రం వాటని సుత్తి రూమర్స్ లో కొట్టి పారేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఆల్రెడీ అన్ని పనులు చక్కగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎనీ టైం అప్డేట్ వచ్చే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :