ఆ రెండు మూవీస్ అక్కడ ఓకే, మరి ఇక్కడ ఏమవుతాయో ?

ఆ రెండు మూవీస్ అక్కడ ఓకే, మరి ఇక్కడ ఏమవుతాయో ?

Published on Jan 24, 2024 2:18 AM IST

రానున్న జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్న సినిమాల్లో ముఖ్యంగా రెండు డబ్బింగ్ సినిమాలు అయలాన్, కెప్టెన్ మిల్లర్ పై ఆడియన్స్ దృష్టి ఒకింత ఎక్కువ ఉంది. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు కలెక్షన్స్ రాబట్టేశాయి. దానితో ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే బాగానే కలెక్షన్ లభించే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఇవి రెండూ కూడా ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయి బాగా టాక్ ని కలెక్షన్ ని అందుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి.

విశేషం ఏంటంటే, కెప్టెన్ మిల్లర్ హీరో ధనుష్ కి అలానే అయలాన్ హీరో శివ కార్తికేయన్ కి తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం. మరి తమిళ ఆడియన్స్ మెప్పు పొందిన ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటాయో చూడాలి. కాగా కెప్టెన్ మిల్లర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహించారు. అయలాన్ మూవీని ఆర్ రవికుమార్ తెరకెక్కించగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు