“పుష్ప 2” : ఈ సీక్వెన్స్ లో వారిద్దరి విశ్వరూపం?

“పుష్ప 2” : ఈ సీక్వెన్స్ లో వారిద్దరి విశ్వరూపం?

Published on Feb 29, 2024 9:14 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ని దర్శకుడు సుకుమార్ అండ్ టీం ప్లానింగ్ ప్రకారం టీమ్స్ వారీగా కంప్లీట్ చేస్తుండగా గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ జాతర సీక్వెన్స్ కోసమే అంతా చర్చగా మారింది.

సినిమాలో భారీ నిడివితో మేకర్స్ ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ ని ప్లాన్ చేయగా ఈ సీన్ కి సంబంధించిన పలు క్రేజీ అంశాలు ఒకొకటిగా తెలుస్తున్నాయి. అయితే ఈ ఒక్క సీక్వెన్స్ లోనే సుకుమార్ చాలా సర్ప్రైజ్ లు ప్యాక్ చేశారట. ఈ సీక్వెన్స్ లో పుష్ప రాజ్ గా ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాకుండా శ్రీవల్లి రష్మిక కూడా కనిపిస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇందులో వీరిద్దరి పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అవుతుంది అని కొన్ని గట్టి టాక్ వినిపిస్తుంది. అలాగే దీనితో పాటుగా మరో థియరీ కూడా దీనిపై వినిపిస్తుంది. ఒకవేళ రష్మిక కాకుండా అయితే మరో సాలిడ్ పెర్సనాలిటీ కనిపించవచ్చని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ ఒక్క సీక్వెన్స్ లో మాత్రం చాలానే ఊహించని సర్ప్రైజ్ లు వీక్షకులని థ్రిల్ చేస్తాయి అనేది మాత్రం పక్కా అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు