గట్టి పోటీ.. ఏ సినిమా గట్టెక్కుతుందో మరి !

Published on May 31, 2019 12:00 am IST

రేపు శుక్రవారం మూడు సినిమాలు విడుదలకానున్నాయి. వాటిలో ‘ఫలక్‌నుమా దాస్, అభినేత్రి 2’ స్ట్రయిట్ సినిమాలు కాగా స్టార్ హీరో సూర్య ‘ఎన్.జీ.కె’ డబ్బింగ్ చిత్రం. ఈ మూడింటిలో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వచించిన ఫలక్‌నుమా దాస్ మీదే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్రం ఆ అంచనాల్ని అందుకోగలిగితే రిజల్ట్ బాగానే ఉంటుంది. అలాగే సూర్య నటించినప్పటికీ ‘ఎన్.జీ.కె’ డబ్బింగ్ సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే బజ్ ఏమీ లేదు. కనుక మొదటి రెండు రోజులు టాక్ గొప్పగా ఉంటే తప్ప సినిమా నిలదొక్కుకోవడం కష్టం.

ఇక తమన్నా, ప్రభుదేవాలు నటించిన మల్టీలింగ్వల్ హర్రర్ మూవీ ‘అభినేత్రి -2’. ట్రైలర్ ఏమంత ఆకట్టుకోలేదు కాబట్టి ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉంటాయి. కానీ హర్రర్ చిత్రం కాబట్టి మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగితే వీకెండ్ పూర్తయ్యేలోపు పుంజుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ మూడు సినిమాలు వేరు వేరు తేదీల్లో విడుదలై ఉంటే దేనికదే బెటర్ ఓపెనింగ్స్ రాబట్టుకునే వీలుండేది. కానీ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి వసూళ్ళలో ఎంతో కొంత చీలిక ఖాయం.

దానికి తోడు ఏది బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలిగితే అదే వారాంతాన్ని ఎక్కువగా క్యాష్ చేసుకోగలుగుతుంది. మరి ఈ మూడింటిలో రేపు ఏ సినిమా మిగిలిన రెండు సినిమాల్ని డామినేట్ చేసి గెట్టెక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More