భారీ స్థాయిలో విడుదలవుతున్న ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ !

భారీ స్థాయిలో విడుదలవుతున్న ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ !

Published on Nov 7, 2018 10:50 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘థగ్స్ అఫ్హిందుస్థాన్’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగు , హిందీ ,తమిళ భాషల్లో దేశవాప్తంగా 5000 స్క్రీన్ లలో అలాగే ఓవర్సీస్ లో 2000 స్క్రీన్లతో కలిపి మొత్తం 7000 స్క్రీన్ లలో విడుదలకానుంది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈచిత్రంలో మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ , ఫాతిమా సన షేక్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక ఈచిత్రం హిందీలో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందించారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న ఈచిత్రం ఫై తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు