విజయ్,కాజల్ ప్రధాన పాత్రలలో వస్తున్న “తుపాకి” నవంబర్ 9న భారీ విడుదలకు సిద్దమయ్యింది. తమిళంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం తెలుగులోకి శోభారాణి ఎస్వీఆర్ మీడియా మీద అనువదించారు. ఈ చిత్రం అనువాద హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని అక్టోబర్ 29న విడుదల చెయ్యనున్నారు. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్రం తమిళ ట్రైలర్ అద్భుతమయిన స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలా భాగం ముంబైలో చిత్రీకరించారు.”బిల్లా 2″ చిత్రంలో విలన్ గా కనిపించిన విద్యుత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో విజయ్ ఇంతవరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చెయ్యలేదు శంకర్ దర్శకత్వంలో వచ్చిన “స్నేహితుడు” చిత్రం కూడా ఇక్కడ దారుణంగా పరాజయం పొందింది. “తుపాకి” చిత్రంతో అయినా విజయ్ విజయం దక్కించుకుంటాడో లేదో చూడాలి మరి.
అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?
అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?
Published on Oct 27, 2012 10:20 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!


