‘ఉప్పెన’ మొదటి వారంలోనే మొత్తం తుడిచేయాలట

Uppena

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం ‘ఉప్పెన’ ఈ నెల 12న విడుదలకానుంది. లాక్ డౌన్ మూలంగా కొన్ని నెలలు ఆలస్యంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇంత ఆలస్యమైనప్పటికీ సినిమా మీద క్రేజ్ మాత్రం తగ్గలేదు. పాటలు, టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ ఏర్పడింది. సాధారణంగా ఒక డెబ్యూ హీరోకు పెట్టే బడ్జెట్ కంటే ఎక్కువే ఈ సినిమాకు ఖర్చు చేశారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించారు.

దీంతో ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రెట్టింపు అయింది. ఆ క్రేజ్ మూలానే బిజినెస్ వర్గాల్లో డిమాండ్ పెరిగింది. కొంచెం ఎక్కువ ధరలకే సినిమాను కొనుగోలుచేశారు డిస్ట్రిబ్యూటర్లు. దీంతో వీలైనంత త్వరగా పెట్టుబడిని రాబట్టుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా టికెట్ ధరలను పెంచుతున్నారట. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ ద్గరను 150 వరకు లేదా అంతకుమించి పెంచే అవకాశం ఉందట. అలాగే మల్టీప్లెక్స్ టికెట్ ధరను 200 వరకు చేయాలని చూస్తున్నారట. లాక్ డౌన్ అనంతరం ఒక సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకోవడం ఇదే తొలిసారి. చూస్తుంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టుబడిని రికవరీ చేయాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

Exit mobile version