సంక్రాంతి సీజన్ వస్తోందంటే సినిమాలకు పండగనే అనాలి. పండుగ మూడు రోజులు సినిమాల వసూళ్లు సాధారణ స్థాయి కంటే రెట్టింపు ఉంటాయి. పెద్ద సినిమాలు థియేటర్లలో ఉంటే ప్రేక్షకుల సందడి చెప్పనక్కర్లేదు. పెద్ద ధరలు చెల్లించి సినిమాల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలు పెంచి ఈ వాతావరణాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
రాబోయే సంక్రాంతికి ఆంధ్రాలో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకనున్నాయి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.200కి, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.250కి పెరగనుంది. ఈమేరకు సంభందిత అధికారుల నుండి అనుమతులు కూడా అందాయట. ఇక తెలంగాణలో అయితే ధరలు ఇప్పటికే సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్ ధర రూ.200 వరకు పెరిగి ఉన్నాయి. మొత్తానికి ఈ పండుగకు సినిమా వినోదం కావాలంటే ప్రేక్షకుడు పెద్ద మొత్తంలో సమర్పించుకోక తప్పదు.


