డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “టైగర్ 3”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “టైగర్ 3”

Published on Dec 6, 2023 1:30 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మనీష్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులని మరోసారి అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12 నుండి సినిమా ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండనుంది. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా, షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు