స్పై యూనివర్స్ లో ప్లాప్ గా “టైగర్ 3”.?

Published on Nov 21, 2023 3:03 pm IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగంగా అయితే వచ్చింది. దీనితో గట్టి అంచనాలే ఈ సినిమా మీద నెలకొనగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా సల్మాన్ కెరీర్ లో గట్టిగానే వచ్చాయి. కానీ ఈ చిత్రంకి ఆ తర్వార నుంచి బాక్సాఫీస్ దగ్గర బాగా టెస్ట్ పడింది.

మెయిన్ గా వరల్డ్ కప్ రోజు వసూళ్లు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక మళ్ళీ ఇది అంత పుంజుకునే అవకాశాలు లేనట్టే బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. దీనితో పఠాన్ వార్ తరహాలో అయితే టైగర్ 3 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ స్టేటస్ తెచ్చుకోవడం కష్టం అనే అంటున్నారు. దీనితో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సీక్వెల్ ప్లాప్ గానే నిలిచిపోవచ్చు అని వారు అంటున్నారు. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :