ఎన్టీఆర్ సౌత్ ఏసియాకే గర్వం – ఆస్కార్ యాంకర్

ఎన్టీఆర్ సౌత్ ఏసియాకే గర్వం – ఆస్కార్ యాంకర్

Published on Mar 13, 2023 10:03 AM IST

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని ‘నాటు నాటు’ పాట గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాగా.. ఈ వేడుక కోసం జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌ చరణ్ ప్రత్యేక డ్రెస్ లో వెళ్లారు. పైగా ఎన్టీఆర్ – చరణ్ ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించారు. ఐతే, ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుక కోసం పులిబొమ్మతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సూట్‌ని ఎన్టీఆర్ ధరించారు. ఆ పులిబొమ్మ కరెక్ట్‌గా ఎన్టీఆర్ భుజంపైకి వచ్చి.. డ్రెస్ పై బాగా హైలైట్ అయ్యింది. దీంతో ఆ పులి బొమ్మ పై ఆస్కార్ నిర్వాహకులు కన్ను పడింది.

ఆస్కార్ యాంకర్స్ లో ఒకరు ‘ఆ బొమ్మ ఎందుకు వేసుకొచ్చారు ? అని ఎన్టీఆర్ ను అడగగా.. ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్‌లో పులిని చూశారు కదా. నాతో పాటు అది కూడా కనిపించింది. నిజానికి, పులి.. మా భారత జాతీయ జంతువు. నేను మా దేశ సింబల్‌తో రెడ్ కార్పెట్‌పై నడవడం నాకు గొప్పగా ఉంటుంది’ అని ఎన్టీఆర్ చెప్పడం అక్కడున్న వారిని బాగా ఆకట్టుకుంది. ఆ మాటకు యాంకర్ ‘మిమ్మల్ని (ఎన్టీఆర్) చూస్తే సౌత్ ఏసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు