నైజాంలో ‘టైగర్’ కి స్ట్రాంగ్ కలెక్షన్స్

నైజాంలో ‘టైగర్’ కి స్ట్రాంగ్ కలెక్షన్స్

Published on Jun 30, 2015 6:23 PM IST

tiger
సినిమా సినిమాకి కాస్తన్నా తమ ఇమేజ్ మరియు తమ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరోస్ సందీప్ కిషన్ మరియు రాహుల్ రవీంద్రన్. వీర్ద్దరూ కలిసి చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్’. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో టైగర్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి.

డిస్ట్రిబ్యూటర్స్ ని అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఒక్క నైజాంలోనే 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. వీక్ డేస్ కూడా స్టడీగా ఉండడంతో మొదటి వారం 1.25 నుంచి 1.5 కోట్ల మార్క్ షేర్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తక్కువ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమాలో డైరెక్టర్ విఐ ఆనంద్ ఫ్రెండ్షిప్, లవ్ నేపధ్యంలో చూసిన ఎమోషనల్ సీన్స్ అందరికీ నచ్చుతున్నాయి. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ పెద్ద హెల్ప్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఇరు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ వేసి స్వయంగా ఆడియన్స్ ని కలిసి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు.

తాజా వార్తలు