
ఒక రైటర్, డైరెక్టర్ అనుకున్న సీన్స్ ఆన్ స్క్రీన్ పైకి వచ్చేటప్పటికి ఆడియన్స్ ని థ్రిల్ చేయాలి, వారికి కనెక్ట్ అవ్వాలి అంటే డైరెక్టర్ కి ఇద్దరి సపోర్ట్ కచ్చితంగా కావాలి, వాళ్ళే సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్. ఈ విషయం చెప్పడానికి కారణం ఈ వారం రిలీజ్ కానున్న ‘టైగర్’ సినిమాకి ఈ రెండు స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలవనున్నాయి. యంగ్ హీరోస్ సందీప్ కిషన్ – రాహుల్ రవీంద్రన్ కలిసి నటించిన మాస్ ఎంటర్ టైనర్ ‘టైగర్’ సినిమా ఈ శుక్రవారం(జూన్ 26న) రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ లో తమన్ మ్యూజిక్, చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది అని అందరూ అంటున్నారు.
దాంతో ఈ విషయాల గురించి ఎంక్వైరీ చేయగా టైగర్ సినిమాలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ హైలైట్ అవ్వడమే కాకుండా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ సీన్స్ లో తమన్ రీ రికార్డింగ్ ఆడియన్స్ ని కట్టి పడేస్తుందని అంటున్నారు. అలాగే చోటా కె నాయుడు చూపిన వారణాశి విజువల్స్ కూడా ఆడియన్స్ కి కొత్తదనాన్ని ఇస్తాయని అంటున్నారు. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విఐ ఆనంద్ డైరెక్టర్. కేవలం రెండు గతాల రన్ టైం తో తీసిన ఈ సినమా షూర్ షాట్ ఆడియన్స్ కి నచ్చుతుందని ఈ చిత్ర టీం అంటోంది.

