సక్సెస్ టూర్లో సందీప్ కిషన్ ‘టైగర్’..!

సక్సెస్ టూర్లో సందీప్ కిషన్ ‘టైగర్’..!

Published on Jun 29, 2015 11:29 AM IST

tiger

సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురుగదాస్ శిష్యుడు వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా ‘టైగర్’. మంచి అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్‌ను సాధించి పెట్టింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన సందీప్ కిషన్, ‘టైగర్’ ద్వారా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ను దాటేస్తాడనే టాక్ మొదట్నుంచీ వినిపిస్తూ వస్తోంది.

‘టైగర్’ సినిమా విడుదలైనప్పట్నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడం, ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం, పెద్ద సినిమాలేవీ విడుదలకు దగ్గరగా లేకపోవడం వంటి కారణాలతో మొదటి వారాంతం మంచి ఓపెనింగ్స్‌నే కొల్లగొట్టింది. ‘టైగర్‌’ సినిమాలో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ యాక్టింగ్, రాహుల్ రవీంద్రన్ స్ట్రాంగ్ సపోర్ట్, కట్టిపడేసే వీఐ ఆనంద్ సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి.
ఇక ఈ సినిమాకు మంచి స్పందన వస్తోన్న నేపథ్యంలో సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్‌ను నిర్వహించనున్నాయి. నేడు వరంగల్, ఖమ్మం, విజయవాడల్లో టైగర్ టీమ్ సక్సెస్ టూర్ నిర్వహించనుంది.

తాజా వార్తలు