హిందూపురం లో తీవ్ర పోటీ ఎదుర్కొనున్న బాలకృష్ణ?

Balakrisha

సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లు విజయవంతంగా గెలిచి నందమూరి వంశానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో పోటీ అంతా వన్ సైడ్ గా ఉంటుందని అందరు అనుకున్నారు.

ఇప్పుడు అక్కడ పోటీ కాస్త తీవ్ర తరంగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అక్కడ ప్రత్యర్ది పార్టీలు ఆయన కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. బాలకృష్ణ స్దానికంగా ఉండరని, ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతారని ప్రచారం చేస్తున్నారు.

మరి ప్రత్యర్ది పార్టీలకు దీటుగా తాను గెలిస్తే ఎక్కడికి వెళ్ళబోనని తాను ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడ ఓ ఇల్లు కూడా బాలకృష్ణ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు బాలకృష్ణ తరుపున విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Exit mobile version