ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ‘టిల్లు 3’ అనౌన్స్ మెంట్ ?

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ‘టిల్లు 3’ అనౌన్స్ మెంట్ ?

Published on Mar 30, 2024 1:07 AM IST

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ల లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి కామెడీ తో పాటు యాక్షన్ అంశాల మేళవింపుగా రూపొందిన ఈమూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దీనిని గ్రాండ్ గా నిర్మించారు.

తమ మూవీకి సక్సెస్ టాక్ రావడంతో యూనిట్ కొద్దిసేపటి క్రితం ఒక మీడియా మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఫస్ట్ షో నుండే తమ మూవీకి సూపర్ హిట్ రెస్పాన్స్ లభిస్తుండడం ఆనందంగా ఉందని, ఇక దీనికి సీక్వెల్ గా మూవీ తీస్తున్నారా అని పలువురు మీడియా మిత్రులు, డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారని, అయితే ఒక చిన్న ఐడియా రావడంతో టిల్లు పార్ట్ 3 ని హీరో సిద్ధు సోమవారం అనౌన్స్ చేస్తారని ఆయన అన్నారు. కాగా ఈ మూవీకి టిల్లు క్యూబ్ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు