ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’

ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’

Published on Apr 17, 2024 12:35 AM IST

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.

విషయం ఏమిటంటే, ఇప్పటికే నార్త్ అమెరికాలో 2.9 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన టిల్లు స్క్వేర్, త్వరలో 3 మిలియన్ డాలర్స్ కి చేరువవుతోంది. ఒక వేళ ఆ ల్యాండ్ మార్క్ ని అందుకుంటే ఈ ఏడాది 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో నిలిచిన రెండవ మూవీగా టిల్లు స్క్వేర్ రికార్డు సొంతం చేసుకున్నట్లే. మరి ఈ మూవీ ఆ ఫీట్ ని ఎంత త్వరగా అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు