సరికొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న “టిల్లు స్క్వేర్”

సరికొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న “టిల్లు స్క్వేర్”

Published on Jan 26, 2024 10:58 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మాలిక్ తెరకెక్కిస్తున్న క్రేజీ రైడ్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి సిద్ధూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా దానికి మించిన ఎంటర్టైన్మెంట్ తో మేకర్స్ దీనిని ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలు చేత వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సింది.

కానీ రీసెంట్ సంక్రాంతి క్లాష్ మూలాన జరిగిన కొన్ని ఒప్పందాలతో నిర్మాత నాగవంశీ ఆ డేట్ నుంచి తమ సినిమా వెనక్కి తీసుకెళ్తానని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు అఫీషియల్ గా అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మరి దీనితో ఈ చిత్రం ఈ మార్చ్ 29న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ సహా శ్రీకర స్టూడియోస్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు