3 రోజుల్లో 68 కోట్లతో “టిల్లు స్క్వేర్”

3 రోజుల్లో 68 కోట్లతో “టిల్లు స్క్వేర్”

Published on Apr 1, 2024 11:41 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లో 68.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రం ఈ వీకెండ్ కి 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు