టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ కి భారీ ధర?

టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ కి భారీ ధర?

Published on Feb 21, 2024 4:04 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శ్శెట్టి నటించిన DJ టిల్లు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దాని సీక్వెల్, టిల్లు స్క్వేర్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మార్చి 29, 2024న థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఆన్‌లైన్‌లో సాలిడ్ బజ్‌ను సృష్టిస్తోంది.

దాదాపు 35 కోట్ల రూపాయల తో డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌లో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు మల్లిక్ రామ్ హెల్మ్ చేసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు