యూఎస్ బాక్సాఫీస్ వద్ద “టిల్లు స్క్వేర్” ఈ రేంజ్ సెన్సేషన్!

యూఎస్ బాక్సాఫీస్ వద్ద “టిల్లు స్క్వేర్” ఈ రేంజ్ సెన్సేషన్!

Published on Apr 1, 2024 9:00 PM IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ క్రేజీ మూవీ భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లో 68.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద జోరు ప్రదర్శిస్తోంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ 8 ప్లేస్ లో నిలిచింది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ వీకెండ్ కి 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. లాంగ్ రన్ లో సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు